![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో...... శకుంతల గదిలోకి వెళ్లి రామనాథం అన్న మాటలు గుర్తుచేసుకొని టెన్షన్ పడుతుంది. అసలు నేను ఇప్పుడు ఎందుకు నిజం దాచాను.. ఏం చేస్తున్నానో అసలు అర్థం కావడం లేదని శకుంతల అనుకుంటుంది. ఇప్పుడే వెళ్లి నిజం చెప్పాలనుకుంటుంది. అప్పుడే తన అంతరాత్మ వస్తుంది. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా.. గంగని ఇప్పటికే గొప్పగా చూస్తున్నారు గంగనే సుధా కూతురు అని తెలిస్తే అందరు నెత్తిన పెట్టుకుంటారు. అయినా సుధా చేసిన మోసానికి తన కూతురు ద్వారా పగ తీర్చుకుంటానని శకుంతల అనుకుంటుంది.
మరొకవైపు సుధా డల్ గా ఉంటుంది. అప్పుడే విశ్వనాథ్ వచ్చి ఏదో డీప్ గా ఆలోచిస్తున్నావని అడుగుతాడు. మా వదినకి జయ తన ఇంటికి కోడలు అవ్వడం ఇష్టం లేదని చెప్పిందని అనగానే విశ్వ షాక్ అవుతాడు. అలాంటప్పుడు అప్పుడే నిజం చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అయిన ఇష్టం లేకుండా ఇంటికి కొడలిని చేస్తే నరకం చూపిస్తారని విశ్వ అంటాడు. అవును బాబు మా గంగ అంటే అమ్మగారికి ఇష్టం లేదు.. ఇప్పుడు తను కూడా బాధని అనుభవిస్తుంది.. అయ్యగారు చెప్పేది కూడా నిజమే అని లక్ష్మీ అంటుంది. పెళ్లి ఎక్కడ ఆపేస్తాడోనని జయ టెన్షన్ పడుతుంది. మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. గంగ నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ అయితే మేమంతా ఎలా రియాక్ట్ అవుతామో ఇమిటేట్ చెయ్యమని అందరు గంగతో చెప్తారు.
దాంతో గంగ అందరిని ఇమిటేట్ చేస్తుంది. శకుంతలని కుడా గంగ ఇమిటేట్ చేస్తుంటే అప్పుడే శకుంతల వస్తుంది. నీకు ఎంత దైర్యం నన్నే ఇమిటేట్ చేస్తావా.. నీ బస్తీ మెంటాలిటి మార్చుకోవా అని గంగపై శకుంతల కోప్పడుతుంది. దాంతో గంగ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. గంగ బాధపడుతుంటే రుద్ర తనకి అర్థం అయ్యేలా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |